Help:Growth/Tools/Enable the Homepage/te
Growth Features | Use the tools | Updates | Projects | Growth Team |
---|
Browse all contents | ||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
హోంపేజీ డిఫాల్టుగా వాడుకరులందరికీ చేతనమై ఉండదు. ఈ పేజీ, అభిరుచుల్లో రెండు పెట్టెల్లో టిక్కు పెట్టి దాన్ని ఎలా చేతనం చేసుకోవాలో వివరిస్తుంది.
మీరొక గురువై, మీ శిష్యులు తమ హోంపేజీని ఎలా చేతనం చేసుకోవాలో వివరించడం, మీరే స్వయంగా హోంపేజీ ఎలా ఉంటుందో చూసేందుకు చేతనం చేసుకోవడం కింది వివరణ ద్వారా తెలుసుకోవచ్చు.
కొత్తగా చేరేవారికి డిఫాల్టుగా హోంపేజీ చేతనమై ఉంటుంది కాబట్టి వారికి ఈ రెండు పెట్టేల్లో టిక్కు పెట్టే ఉంటుంది.
To check if your Homepage is enabled, just type Special:Homepage
in the wiki's search engine.
హోంపేజీని చేతనం చెయ్యడం
హోంపేజీని చేతనం చేసుకునేందుకు, మీ వాడుకరి అభిరుచులలో వాడుకరి ప్రవర ట్యాబుకు వెళ్ళండి
అక్కడ, "కొత్త వాడుకరి హోంపేజీ" విభాగంలో "కొత్త వాడుకరి హోంపేజీని చూపించు" చెక్‌బాక్సు కోసం చూడండి. దీనిపై టిక్కు పెడితే హోంపేజీ చేతనమౌతుంది.
హోంపేజిని చేతనం చెయ్యడం వలన వాడుకరి పేజీ, వాడుకరి చర్చ పేజీ ట్యాబులకు సమీపంలో ఓ కొత్త ట్యాబు వచ్చి చేరుతుంది. ఈ కొత్త ట్యాబుపై "హోంపేజీ" అని ఉంటుంది.
హోంపేజీని డిఫాల్టుగా చేసుకోండి
హోంపేజీని చేతనం చెయ్యడంతో అభిరుచుల్లో "వ్యక్తిగత పరికరాల్లోని వాడుకరిపేరును డిఫాల్టుగా కొత్త వాడుకరి హోంపేజీకి లింకు చెయ్యి" అనే మరో చెక్‌బాక్సు కనిపిస్తుంది. దీనిలో టిక్కు పెడితే, తెరపై పైన కుడి పక్కన ఉండే మీ వాడుకరిపేరును నొక్కినపుడు మీ వాడుకరి పేజీకి కాకుండా నేరుగా Special:Homepage కి పోతుంది.
అది మీకు మాత్రమే జరుగుతుంది. ఇక్కడ మాత్రమే జరుగుతుంది, ఇంకెక్కడా జరగదు. ఇతరులు మీ వాడుకరిపేరుపై నొక్కినపుడు మామూలుగానే మీ వాడుకరి పేజీకి తీసుకుపోతుంది.
Enable the help panel
If you want to work on Suggested Edits provided by the Homepage, then you must enable the Help panel as well.
If the help panel is available on your wiki, you can enable the panel by going to your preferences, in the Editing tab.