Growth/Feature summary/te

From mediawiki.org
This page is a translated version of the page Growth/Feature summary and the translation is 70% complete.
Outdated translations are marked like this.
Growth Features Use the tools Updates Projects Growth Team
Browse all contents
Discover the existing Features Help pages and resources around the Features Project's last news Current initiatives and strategic thinking about building the Features or creating resources. Who we are

General help and resources

Help resources for mentors Help resources for communities
గ్రోత్ బృందం విశేషాలను చూపించే వీడియో. వ్యాఖ్యలు మీ భాషలో అందుబాటులో ఉండవచ్చు.

కొత్తవారు వికీపీడియాలో దిద్దుబాటు చేసేందుకు, ఇందులో కొనసాగేందుకూ ఇబ్బందులు పడడానికి మూడు ప్రధాన సమస్యలున్నాయని పరిశోధనలో తేలింది: సాంకేతికంగా, పద్ధతుల పరంగా, సాంస్కృతికంగా. ఈ సమస్యలను ఎదుర్కొనేందుకు అవసరమైన వనరులు ప్రస్తుతం వారికి అందుబాటులో లేవు. వీరికి ఈ వనరులను అందించడానికి, WMF గ్రోత్ బృందం మూడు పరస్పర సంబంధమున్న విశేషాలను రూపొందించింది. వాటి గురించి కింద వివరించాం. ఈ విశేషాల వలన కొత్తవారిలో చురుకుదనం, నిలిచి ఉండడం, దిద్దుబాటు సంఖ్య పెరిగాయని గమనించాం.

  • కొత్త వాడుకరి హోంపేజీ: "కొత్త వాడుకరి పనుల"ను చూపించే ప్రత్యేక పేజీ. కొత్త వాడుకరి వికీలో పని మొదలు పెట్టడానికి ఈ పేజీ చక్కటి నాంది పలుకుతుంది. హోంపేజీ ద్వారా అనేక వనరులు కొత్త వాడుకరికి అందుబాటులో ఉంటాయి. వారి ప్రశ్నలకు సమాధానాలిచ్చే గురువు లింకు కూడా ఈ వనరుల్లో ఒక భాగం.
  • కొత్త వాడుకరి పనులు: దిద్దుబాటు చెయ్యడం నేర్చుకోవడంలో భాగంగా వారికి సూచించే కొన్ని పనులివి. ఈ ఫీడు ద్వారా కొత్తవారు ప్రయోజనకరమైన దిద్దుబాట్లు చేస్తున్నారు. ఈ ఫీడు హోంపేజీలో ఒక ముఖ్య అంశంగా ఉంటుంది.
  • సహాయ ప్యానెల్: కొత్త వాడుకరులు దిద్దుబాట్లు చేస్తూండగా అవసరమైన వనరులను అందించే ప్లాట్‌ఫారం ఇది. కొత్త వాడుకరుల పనులపై పనిచేసేటపుడు ఈ సహాయ ప్యానెల్, కొత్త వాడుకరులకు ఏం చెయ్యాలనే విషయమై మార్గం చూపిస్తుంది.

Some features are also available for communities:

  • Community configuration : a special page where communities can change how Growth features work.
  • Mentorship features : a set of tools to match newcomers looking for advice with experienced editors ready to help.

ఈ విశేషాలన్నీ డెస్క్‌టాప్, మొబైలు - రెంటి పైనా అందుబాటులో ఉన్నాయి. ఈ విశేషాలను కొన్ని వికీల్లో పరీక్షించవచ్చు. They are available by default for newcomers at a majority of Wikipedias.

గ్రోత్ బృందం గురించి మరిన్ని వివరాల కోసం, mediawiki.org లోని ఈ పేజీ చూడండి. మీ వికీలో ఈ విశేషాలను స్థాపించుకోవడం కోసం, మా స్థాపన వివరాల పేజీ చూడండి. If you have questions, please check our FAQ. You can also leave us a message.

కొత్త వాడుకరి పనులు

గ్రోత్ విశేషాల్లోని ప్రధాన భాగం ఇది. తమ మొదటి దిద్దుబాటును చేస్తున్న కొత్త వాడుకరుల సంఖ్య, మరిన్ని దిద్దుబాట్లు చేసేందుకు తిరిగి వస్తున్నవారి సంఖ్య, వాళ్ళు చేస్తున్న దిద్దుబాట్లు సంఖ్య - ఇవన్నీ పెరగడానికి ప్రధానంగా దోహదపడుతున్నది ఇదే. కొత్త వాడుకరి పనులు అనేది ఏ వ్యాసాల్లో దిద్దుబాట్లు చెయ్యాలో కొత్తవారికి చూపించే వర్క్‌ఫ్లో. ఇది కొత్త వాడుకరి హోంపేజీలో సూచించిన దిద్దుబాట్లు మాడ్యూల్లో ఇవి కనిపిస్తాయి. వివిధ రకాల దిద్దుబాట్లలో కొత్త వాడుకరులు తమకు తోచిన దాన్ని ఎంచుకోవచ్చు (నిర్వహణ మూసల ప్రకారం). తమకు ఆసక్తి ఉన్న విషయాలను ఎంచుకోవచ్చు (ORES models ప్రకారం). వ్యాసాల ఫీడు నుండి వ్యాసాలను ఎంచుకుని వాటిపై పనిచెయ్యవచ్చు. ఒకసారి వ్యాసాన్ని ఎంచుకుని ఆ పేజీకి వెళ్ళాక, దిద్దుబాటును ఎలా ముగించాలో సహాయ ప్యానెల్ వారికి దారి చూపిస్తుంది. In 2021, the Growth team is building new editing workflows that aim to make it smaller and easier for newbies, especially from mobile devices. These are called "structured tasks". As of June 2021, we have implemented the first structured task for adding wikilinks to four Wikipedias (Arabic, Czech, Vietnamese and Bengali). In it, an algorithm suggests to newcomers words or phrases that could be good wikilinks.

కొత్త వాడుకరి హోంపేజీ

ఈ ప్రత్యేక పేజీలో కొత్త వాడుకరుల పనుల వర్క్‌ఫ్లో ఉంటుంది. కొత్త వాడుకరులు తమ మొట్తమొదటి రోజున ఏమేం చూడాలో వాటిని చూపించే ఇతర మాడ్యూళ్ళు కూడా ఉంటాయి. ఖాతా సృష్టించుకున్నాక, కొత్తవారిని తమ హోంపేజీ చూసుకోమంటూ ఒక పాపప్ కనిపిస్తుంది (మరికొన్ని ఇతర గమనింపులతో పాటు). బ్రౌజర్లో పైన, వ్యక్తిగత లింకుల్లో ఉండే వాడుకరిపేరును నొక్కినపుడు కూడా వారు ఈ పేజీకి వెళ్లవచ్చు. బృందం కొన్ని మాడ్యూళ్ళపై ఇంకా పనిచేస్తున్నప్పటికీ, కింది మాడ్యూళ్ళు హోంపేజీలో కనిపించవచ్చు.

  • మెంటర్‌షిప్ మాడ్యూలు: ప్రతీ కొత్త వాడుకరికీ ఒక గురువును కేటాయిస్తుంది. గురువు చర్చ పేజీలో ప్రశ్నలు అడిగేందుకు ఒక సులువైన పద్ధతిని అందిస్తుంది. గురువులు స్వచ్ఛందంగా ఈ పనిలో పాలుపంచుకుంటారు. This feature has to be configured by the community to become active.
  • దిద్దుబాటు సూచనల మాడ్యూలు: పైనున్న "కొత్త వాడుకరి పనులు" చూడండి.
  • సహాయం మాడ్యూలు: ఎక్కువగా చూసే సహాయం పేజీల లింకుల జాబితాను చూపిస్తుంది.
  • ప్రభావం మాడ్యూలు: కొత్తవాఅరు దిద్దుబాటు చేసిన వ్యాసాల్లో ఒక్కొక్కపేజీకి చెందిన పేజీవ్యూలను చూపిస్తుంది.
  • Emails: The page also encourages users to add and confirm their email address.

ఇప్పటి వరకూ ఉన్న ఫలితాలు

  • కొత్త వాడుకరుల్లో మెజారిటీ భాగం తమ హోంపేజీని సందర్శిస్తున్నారు. వారిలో చాలామంది తదనంతర కాలంలో హోంపేజికి తిరిగి వస్తున్నారు.
  • 2020 నవంబరు నాటికి 11,785 వాడుకరులు, 14,228 ప్రశ్నలు అడిగారు.
  • హోంపేజీ కారణంగా నిర్ధారిత ఈమెయిలు చిరునామా ఇచ్చే కొత్త వాడుకరుల సంఖ్య పెరిగింది.

కొత్త వాడుకరి హోంపేజీ గురించి మరింత సమాచారం కోసం, mediawiki.org లోని ఈ పేజీ చూడండి.

సహాయ ప్యానెల్

కొత్త వాడుకరులు దిద్దుబాట్లు చేస్తూ చేస్తూ తెరవగలిగే పెట్టె ఇది. ఇది నాలుగు పనులు చేస్తుంది:

  • సూచించిన దిద్దుబాట్లు చేసేటపుడూ కొత్తవారికి మార్గం చూపిస్తుంది.
  • ఎక్కువగా చూసే సహాయం పేజీలకు లింకులను చూపిస్తుంది.
  • కొత్త వాడుకరులు ఇతర సహాయం పేజీలు, విధానాల పేజీల కోసం వెతికే వీలు కల్పిస్తుంది.
  • కొత్త వాడుకరులు నేరుగా సహాయ కేంద్రంలో ప్రశ్న అడిగేందుకు వీలు కల్పిస్తుంది.

సహాయ ప్యానెల్ విజువల్ ఎడిటరు, వికీటెక్స్టు ఎడిటరు - రెంటి లోనూ కనిపిస్తుంది. ఈ విశేషాన్ని మేం స్థాపించినపుడు వికీలో ఈసరికే ఉన్న సహాయ కేంద్రం దీనితో కలిసి పనిచేసేలా చూస్తాం. ఈ కేంద్రాన్ని చూసే అనుభవజ్ఞులు ఇక్కడ అడిగే ప్రశ్నలను స్వీకరించేందుకు సుముఖంగా ఉండేలా చూస్తాం.

ఇప్పటి వరకూ ఉన్న ఫలితాలు

  • సహాయ ప్యానెల్‌ను చూసిన వారిలో దాదాపు 20% మంది దాన్ని తెరుస్తున్నారు. వారిలో 50% మంది దాన్ని సంప్రదిస్తున్నారు.
  • సహాయ ప్యానెల్ దానంతట అదే కొత్త వాడుకరుల దిద్దుబాట్ల సంఖ్యను పెంచదు. పైన చూపిన కొత్త వాడుకరుల పనుల ప్రవాహంలో భాగంగా మార్గదర్శకత్వం చేసేందుకు ఈ విశేషాన్ని ఉంచేసాం.

సహాయ ప్యానెల్ గురించి మరింత సమాచారం కోసం, mediawiki.org లోని ఈ పేజీ చూడండి.

Community configuration

Communities can change how the Growth features work by editing Special:EditGrowthConfig.

We advise all communities to make configuration changes after a community discussion. Please inform us of your discussions when they happen, because we can help you on the issue you found, or assist you with the configuration. It is also very useful for us to know that you have that discussion, so that we can improve the features.

Mentorship

Mentorship features are a set of tools to match newcomers looking for advice, with experienced editors ready to help them.

Mentorship is activated using the Community configuration page.

Mentors can then sign up visiting Special:MentorDashboard. This page is where mentors can configure their mentorship preferences, and, if needed, put themselves on pause or quit.

It is up to each community to decide on criteria to become a mentor. We advise community members to keep the criteria simple and encouraging, so that more mentors would signup.

Please visit our FAQ for more information.

ఈ విశేషాలను పరీక్షించండి

గ్రోత్ విశేషాలు అందుబాటులో ఉన్న వికీల్లో గాని, test.wikipedia.org లో గానీ, మీ అభిరుచులు కు వెళ్ళి అక్కడ కింది పనులు చెయ్యండి:

  • కొత్త వాడుకరి హోంపేజీని చూపించు — కొత్త వాడుకరి హోంపేజీని చేతనం చెయ్యడంతో కొత్త వాడుకరి పనులు అందుబాటు లోకి వస్తాయి.
  • ఎడిటరు సహాయ ప్యానెల్‌ను చేతనం చెయ్యిIf you don't turn the Help panel on, Newcomers tasks won't work properly.