వికీమీడియా లాంగ్వేజ్ ఇంజనీరింగ్/న్యూస్‌లెటర్/23/2023/అక్టోబరు

From mediawiki.org
This page is a translated version of the page Wikimedia Language engineering/Newsletter/2023/October and the translation is 67% complete.
Outdated translations are marked like this.

లాంగ్వేజ్ టీమ్ అందిస్తున్న భాష - అంతర్జాతీయకరణ న్యూస్‌లెటర్ మొదటి సంపుటికి స్వాగతం

'భాషకు సంబంధించిన వివిధ సాంకేతిక ప్రాజెక్టుల లో కొత్త ఫీచర్ల అభివృద్ధి, మెరుగుదలపై, సపోర్ట్ వర్క్, సముదాయ సమావేశాలు, కలసి పనిచేయడానికి ఉపయోగపడే ఆలోచనలు - ఇలాంటి విషయాల్లో తాజాగా గత మూడు నెలల వివరాలను అందిస్తుంది.

ముఖ్యాంశాలు

202 భాషల వికీపీడియాలకు మెషీన్ లెర్నింగ్ (మింట్) అందుబాటులో ఉంది

మింట్ ఉపయోగించి చెరోకీకి డెస్క్‌టాప్ అనువాదం

2023 జూన్‌లో ఎక్కువ సౌలభ్యాలు అందుబాటులో లేని భాషలకు MinT అన్న కొత్త యాంత్రికానువాద సేవలను ప్రారంభమయ్యాయి, ఇప్పుడు ఇది 202 భాషల వికీపీడియాల్లో అందుబాటులో ఉంది. కొన్ని భాషల విషయంలో అందుబాటులోకి వస్తున్న మొట్టమొదటి యాంత్రికానువాద ఉపకరణం ఇదే. అందువల్ల ఇది పెద్ద విశేషమే. ఇది అనువాదాల నాణ్యతను మరింత మెరుగుపరచనుంది. ఈ సముదాయాల్లో కొందరు గూగుల్ అనువాదం కన్నా మింట్‌తో చేసిన అనువాదాలు బాగుంటున్నాయని చెప్పి, దానిని తమ డిఫాల్ట్ అనువాద సాధనంగా ఏర్పాటు చేయాలని సూచించారు.[1]

మింట్ ఇక్కడ ప్రయత్నించండి.

గత త్రైమాసికంలో అన్ని వికీపీడియాలలో కలిపి 67 వేలకు పైగా అనువాదాలు అయ్యాయి

గత త్రైమాసికంలో (2023 జూలై-సెప్టెంబర్) కంటెంట్ ట్రాన్స్లేషన్ సాధనం (వికీపీడియా అనువాద ఉపకరణం) అన్ని వికీపీడియాలలో కలిపి 67 వేల అనువాదాలను నమోదు చేసింది, అత్యధిక సంఖ్యలో అనువాదాలు [స్పానిష్]లో జరిగాయి.[2] కంటెంట్ ట్రాన్స్లేషన్ సాధనం ప్రారంభించినప్పటి నుండి దానిలో 18.3 లక్షల అనువాదాలు జరిగాయి. మరోవైపు, కొరియన్ వికీపీడియాలోని విభాగ అనువాదం ఫీచర్ వాడి జూలైలో 471 అనువాదాలు జరిగాయి, ఇది 2022 మేలో ప్రారంభించిన మొదటి నెలలతో (అప్పట్లో నెలకు 50 కన్నా తక్కువ అనువాదాలుండేవి) పోలిస్తే పెద్ద ఎదుగుదలే. ఫీచర్‌ని వాడకం పెరగడానికి, సముదాయం దాన్ని స్వీకరించడానికి వివిధ భాషల్లో వేర్వేరు స్థాయిల కార్యకలాపాలు అవసరమవుతాయని, సమయం కూడా వేర్వేరు స్థాయుల్లో కావాల్సి వస్తుందినీ చూపిస్తోంది.

వికీపీడియా అనువాద ఉపకరణం డెమో వీడియో

భాషా సాధనాలకు మెరుగుదలలు: పార్సాయిడ్ ఇంటిగ్రేషన్, సర్వీస్ నవీకరణలు, మరిన్ని అంశాలు

కంటెంట్ ట్రాన్సలేషన్ (లేక అనువాద ఉపకరణం) ఇప్పుడు నెట్వర్క్ ఏపీఐ అభ్యర్థనలు అక్కరలేకుండా నేరుగా Parsoid తో కమ్యూనికేట్ చేయగలదు. పార్సోయిడ్ అన్న సేవ వికీపీడియా భాష (వికీ టెక్స్ట్) మరింత సాధారణ వెబ్ భాష (హెచ్‌టిఎంఎల్)గా మరింతగా కనిపించేలానూ, హెచ్‌టిఎంఎల్ వికీటెక్స్ట్‌లా కనిపించేలానూ మార్చగలదు. ఈ మార్పు కంటెంట్ అనువాదాన్ని వేగవంతం చేయడానికి ఉద్దేశించబడింది.

కంటెంట్ అనువాదం , సెక్షన్ అనువాద ఉపకరణాలు కూడా ఇప్పుడు అనువాదం చేయడానికి మరింత మద్దతునివ్వడం ప్రారంభించాయి - వేర్వేరు వెబ్‌బ్రౌజర్ సెషన్ల మధ్య అనువాదపు చిత్తుప్రతులు పోకుండా రీస్టోర్ చేయడం, కంటెంట్ అనువాదం ఎంతయిందో తెలియజేసేలాంటి ప్రోగ్రెస్ బార్, వేరే భాష నుంచి అనువాదం కొనసాగించే వీలు, మొదలైనవి కొత్తగా వచ్చాయి.

కంటెంట్ అనువాద విధానం చాలా కాలంగా యౌడో అన్న అనువాద సేవను ఉపయోగించింది. దీనిని ఎవరూ ఉపయోగించడం లేకపోవడం వల్ల, ఇదే పనిచేయగల వేరే సేవలు అందుబాటులో ఉండడం వల్ల ఇది ఇప్పుడు నిలిపివేయబడుతుంది. ఇలా చెయ్యడం వల్ల దాన్ని నిర్వహించడంలో ఖర్చయ్యే సమయమూ, ప్రయత్నమూ ఆదా అవుతాయి. అయితే, అవే భాషలకు మిగతా యాంత్రికానువాద సేవలు మాత్రం ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి.

ఎంపికచేసిన బహుభాషా ఫీచర్లను అందించే మీడియావికీ ఎక్స్‌టెన్షన్లతో కూడిన MediaWiki Language Extension Bundle కొత్త వెర్షన్ విడుదలైంది. ఈ ఎక్స్‌టెన్షన్ల కోసం చేసిన అప్‌డేట్ల పూర్తిజాబితా కోసం వెర్షన్ 2023.04 రిలీజ్ నోట్స్ చూడండి.

అనువాదం కాగల పేజీలపై వాడుకరులపై జరిగిన అధ్యయనం (యూజర్ స్టడీ) నుంచి ఉపయోగకరమైన విశేషాలు

అనువాదం కాగల పేజీల సర్వే ఫలితాలు

అనువాదం కాగల పేజీలు, అన్నది ఒక మీడియావికీ ఫీచర్. దీన్ని ఉపయోగించి వాడుకరులు వివిధ భాషల్లోకి అనువదించదగ్గ వికీ పేజీలను గుర్తించగలుగుతారు. ఈ ఫీచర్ ఉపయోగించి వివిధ భాషల్లో కొత్త వీకీ పేజీలు కూడా సృష్టించవచ్చు. అయితే, ఇక్కడ ఒక సంగతి ఉంది: ఇది ఉపయోగించడం కొంత గమ్మత్తుగా, సంక్లిష్టంగా ఉంటుంది. దీన్ని వికీలో బాగా చెయ్యితిరిగిన అడ్వాన్స్డ్ వాడుకరుల కోసం రూపకల్పన చేశారు.

The Translate extension is wonderful and with all its flaws, I still love it

—David

Recently, design researchers in the Language team conducted a study to find out what problems people face when they try to use this feature. The metric they were interested in was how to increase the number of people who are successful at creating and updating translatable pages, and improving ease for those with less technical knowledge. You can find a summary of what they discovered in this research report.

West Coast Bajau women in traditional dress
Our highest good is making sure that weʼre making really good use of translatorsʼ time.

—Alice

Empowering speakers of an indigenous language from Malaysia

Language technical support for West Coast Bajau, an indigenous language from Malaysia was recently added in MediaWiki. This means that people who speak this indigenous language can now help translate the software and content on different Wikimedia websites into their language.

Community meetings and events

Get involved

Stay tuned for the next release! You can subscribe to this newsletter.

References